
తుఫాన్ ‘మాన్తా’ ప్రభావం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విభాగాల అధికారుల సెలవులను రద్దు చేసి, జిల్లాల వారీగా ప్రత్యేక నియంత్రణాధికారులను నియమించారు.
పంటల రక్షణ, ధాన్యం కొనుగోలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, బ్రిడ్జ్‌లు, జలాశయాలు, రహదారులపై ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.



You must be logged in to post a comment.